ఒకసారి కాకినాడ కాజా తింటే ఆ కాజాను మరలా తినాలని చాలామంది తహతహలాడుతారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఉభయ గోదావరి జిల్లా ప్రజలు కాకినాడ కాజా వలన ఆంధ్రుల గౌరవం మునుపటితో పోలిస్తే మరింతగా పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలో, ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగువాళ్లు కాకినాడకు వస్తే తప్పకుండా కాజాను కొనుగోలు చేసి వెళతారు. కాకినాడ కాజాకు ఉండే ప్రత్యేకమైన రుచి వలన ఆ కాజాకు కాకినాడ కోటయ్య కాజాగా గుర్తింపు వచ్చింది.
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాకినాడ గొట్టం కాజాను నేటి తరం గుర్తించేందుకు ప్రత్యేక పోస్టల్ కవర్‌ను తపాల శాఖ విడుదల చేసింది. 1891లో తొలిసారిగా కాకినాడ కాజాను తయారుచేశారు. కోటయ్య అనే వ్యక్తి తొలిసారిగా ఈ కాజాను తయారు చేసి కీర్తిని పొందారు. 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాయంగా మరింత ప్రచారం కల్పించింది. కాకినాడ కాజాతో పాటు మాడుగుల హల్వా విశిష్టతను సైతం పోస్టల్ కవర్ ద్వారా తపాల శాఖ వెలుగులోకి తెచ్చింది. విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి తయారు చేసిన ఈ హల్వాకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. గోధుమపాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు సమాహారంగా మాడుగుల వాసులు ఈ రుచికరమైన హల్వాను తయారు చేస్తున్నారు. ఈ హల్వా లైంగిక సామర్థ్యం పెంచే గుణం కూడా ఉన్నట్లు అంతర్జాతీయంగా ప్రచారం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital