Friday, November 22, 2024

ఐఐటీ తిరుపతిలో పబ్లిక్‌ పాలసీలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సు.. చివరి తేదీ ఏప్రిల్‌ 18

ఏర్పేడు, (చిత్తూరు) ప్రభ న్యూస్‌: తిరుపతి ఐఐటీ ఏర్పాటైన అది కొద్ది కాలంలోనే జాతీయస్థాయిలో నూతన ఒరవడి సృష్టిస్తోంది. ఐఐటీ బాంబే ,ఐఐటీ ఢిల్లీల తరువాత ఐఐటీ తిరుపతి పబ్లిక్‌ పాలసీలో అభ్యర్థులకు పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సును నూతనంగా ప్రవేశ పెడుతోంది. దీని వల్ల నూతన కోర్సు తో మరింత మందికి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఐఐటి నూతన కోర్సులను అందించనుంది. కేంద్రీయ విశ్వ విద్యాలయాలలో (ఐఐటీ-) విద్యాభ్యాసం చేయాలని భావించే మరికొంత మంది విద్యార్థులకు పీజీ అవకాశం తిరుపతి లోనే దక్కనుంది. ఇందుకు దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. ఏప్రిల్‌ 18 చివరి తేదీగా ఐటీ- అధికారులు వెల్లడించారు. మానవీయ సామాజిక శాస్త్రాల శాఖ సహకారంతో ఐఐటీ- తిరుపతి పబ్లిక్‌ పాలసీలో అభ్యర్థులకు పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సు ని ప్రారంబించనుంది. విధాన విశ్లేషణ, సమకాలీన పాలనపై రెండేళ్ల వ్యవధిలో ఈ కోర్స్‌ ఉంటు-ంది. కోర్స్‌ వల్ల దేశంలోనే కాకుండా, బయట దేశాల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి.

ఈ కోర్స్‌లో సైన్స్‌, మేనేజ్మెంట్‌ సైన్స్‌, మేనేజ్మెంట్‌ ఆఫ్‌ స్టసనబిలిటీ-, డేటా సైన్స్‌ ఇలా మూడు అంశాలు ఉంటాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ రంగ సంస్థలతో విధాన రూపకల్పనలో విద్యార్థులు పనిచేయటానికి అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా విద్యార్థులకు గుణాత్మక మరియు పరిమాణాత్మక నైపుణ్యాలను అందించడంపై దృష్టి పెడుతుంది. దీనికితోడు పరిపాలనాలో తీసుకొని నిర్ణయాధికారాలను మరియు రాజకీయ పద్ధతులను తెలియచేసి వారికి అవగాహన కల్పిస్తుంది. ఐఐటీ- బాంబే, ఐఐటి ఢిల్లీ తరువాత ఐఐటీ- తిరుపతి ఈ కోర్స్‌ని మొదటగా విద్యార్థుల కోసం ప్రవేశ పెడుతోంది. ఏదైనా రంగంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఐఐటి అధికారులు వెల్లడించారు. గేట్‌ స్కోర్‌ ద్వారానే కాకుండా సాధారణంగా కూడా ఈ కోర్స్‌లకి దరఖాస్తు చేసుకోవచ్చునని వారు వెల్లడించారు. గేట్‌ ద్వారా చేసుకొన్నా అభ్యర్థులకు ్టసపెండ్‌ అందించనున్నట్లు- ఐఐటీ- అధికారులు తెలిపారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్‌ 18 అని వారు వివరాలు తెలియజేసారు. వివరాల-కై- ఐఐటీ- తిరుపతి అడ్మిషన్‌ సంప్రదించవచ్చునని పిఆర్‌ఓ చప్పిడి చమన్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement