Friday, November 22, 2024

పదవులు రావొచ్చు.. పోవచ్చు.. నేను మాత్రం ప్రజలతోనే ఉంటా: పవన్‌ కళ్యాణ్‌

విశాఖపట్నం, ప్రభన్యూస్‌: పదవులు రావొచ్చు పోవచ్చు కానీ, నేను మాత్రం ప్రజా పక్షాన వెంటే ఉంటానని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కనికరం లేదన్న ఆయన బ్లీచింగ్‌ జల్లితే కష్టాలు తీరిపోతాయ? అని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో గులాబ్‌ తుపాను ముంచెత్తినప్పుడు ప్రభుత్వం కదిలిందా అని ప్రశ్నించిన ఆయన సిక్కోలు ఉద్యమన స్ఫూర్తిని రాష్ట్రమంతటా తీసుకువద్దామని పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు.

మద్యం అమ్మకాలతో ఈ ప్రభుత్వం 23,500 కోట్లు సంపదిస్తోందన్నారు. మార్పులు సిక్కోలు నుంచే రావాలన్నారు. మంగళవారం విశాఖపట్నంలో శ్రీకాకుళం జిల్లా నాయకులూ కార్యకర్తలతో పవన్‌ కళ్యాణ్‌ సమావేశమై పలుఅంశాలను ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వం గంజాయి మొక్కను ఏపీ చిహ్నంగా మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. మమ్మీ డాడీ వైన్స్‌ పాలసీని వైసీపీ ముందుకు తీసుకు వెళుతుందని చెబుతూ ఏపీలో అమ్మే లిక్కర్‌ క్వాలిటీపైనా అనుమానాలు ఉన్నాయన్నారు.

టీడీపీ సమయంలోనూ సమస్యల పట్ల తాను మాట్లాడానని, ప్రజల కోసమే కూటమి నుంచి బయటకు వచ్చానని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. లంచాలు అడిగితే కాలుష్య రహిత పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించిన ఆయన వైసీపీ అభివృద్దిని పూర్తిగా పక్కన పెట్టేసిందన్నారు. సిక్కోలు ఉద్యమ స్ఫూర్తిో వైసీపీ కోటలు బద్దలు కొట్టాలని వచ్చే ఏడాది నుంచి ఎన్నికల సన్నాహాలు ప్రారంభిస్తానన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వమే మద్యాన్ని అమ్మడం ఏంటన్నారు.

జనసేన పార్టీ మాత్రం 70 శాతం ఆడపడుచులు కోరుకుఉన్న ప్రాంతంలో మద్య నిషేధం అమలు చేస్తుందన్నారు. గంజాయి సాగు వైసీపీ హయాంలో మొదలు పెట్టారని తాను చెప్పను కానీ, ప్రత్యేక హోదా కోసం తాను గౌరవించే బీజేపీతో గొడవ పెట్టుకున్నానని చెప్పారు. సమస్యల మీద పోరాటం చేసేటప్పుడు ప్రజాపక్షమే వహిస్తానని, నాయకుల పక్షం కాదన్నారు. వైసీపీ మద్యంతో రెండేళ్లకే లివర్‌ పోతుందని, వైసీపీ సంపూర్ణ మద్య నిషేదం అని చెప్పి ఇప్పుడు చెన్నైలోని మమ్మీ డాడీ వైన్స్‌ స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళుతుందని విమర్శించారు. తాగుడు వల్ల పదేళ్లలో పాడయ్యే లివర్‌ రెండేళ్లకే పాడవుతుందన్నారు. అబ్కారీ శాఖలో పని చేసిన కొందరు తెలిసిన వాళ్లు మద్యంలో మత్తు పదార్థాలు కలుపుతున్నారనే సందేహాలను వ్యక్తం చేసినట్లుగా చెప్పారు.

సంపూర్ణ మద్య నిషేదం పేరుతో యువతకు బూం బూం బీరు.. కాస్త ఎక్కువ కష్టపడిన వారికి ప్రెసిడెంట్‌ మెడల్‌ పోసి డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. జనసేన మద్యం నిషేధం వ్యవహారంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, ఈ ప్రభుత్వం మాత్రం రూ.23,500 కోట్లు సంపాదిస్తోందన్నారు. వనరులు ఉన్నా సిక్కోలు యువత వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధీ సంక్షేమం పక్క పక్కనే ఉండాలని చెబుతూ పరిశ్రమలు ప్రయివేటు లోనూ ఉండాలన్నారు.ప్రభుత్వం లంచాలు అడగకుండా ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు.

- Advertisement -

కాలుష్యం తగ్గించే పరిశ్రమలురావాలని, యువతకు ఉద్యోగాలు రావాలన్నారు. శ్రీకాకుళం నుంచి వలసలు ఆగాలన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ అంటే పోస్టులుఇస్తామనన 450 పోలీసు పోస్టులూ బర్తీ చేయకపోవడమనీ, ఇళ్లు ఇస్తామంటే అడవుల్లో..స్మశానంలో.. గుంతల్లో ఇస్తామని ఈ ప్రభుత్వం అర్ధం అన్నారు. దీన్ని ప్రశ్నించేందుకు ప్రతి జనసైనికుడూ సిద్దంగాఉండాలని పిలుపునిచ్చారు. జనసైనికులు కట్టిన పార్కును స్పీకర్‌ ప్రారంభించడమేంటని పవన్‌ క ళ్యాణ్‌ ప్రశ్నించారు.

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంధకారం అయిపోయిందన్నారు. ఉద్దానం ప్రాంతంలో ఇవ్వాల్సిన పించనలు కట్‌ అయిపోయాయని, నాడు ఇచ్చిన సూపర్‌ స్పెషాల్టి ఆసుపత్రి మామీఏమయ్యిందని ప్రశ్నించారు. ప్రభుత్వాలు చిన్నచూపు చూడడంతో యువత నలిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి కుటుంబ పాలనను దూరం చేయండంటూ ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్‌, బొలిశెట్టిసత్యనారాయణ, పాలవలస యశస్వి, పీఏసీ సభ్యులు కోన తాతారావు, రాష్ట్ర కార్యదర్శులు గడసాల అప్పారావు, బొడపాటి శివదత్‌, శ్రీకాకులం జిల్లా నాయకులు పేడాడ రామ్మోహన్‌, దాసరి రాజు, కణితికిరణ్‌ , కోరాడ సర్వేశ్వరరావు, మెట్ట వైకంఠరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement