వెలుగు వాట్సప్ గ్రూపులో ఓ అశ్లీల వీడియో పోస్టు అందరిని అయోమయానికి గురి చేసింది. స్వయం సహాయక సంఘాలకు సమాచారాన్ని అందించే గ్రామ సమాఖ్యల పర్యవేక్షకుల వాట్సాప్ గ్రూపులో బుధవారం రాత్రి అభ్యంతకర వీడియో పోస్టయింది. ఈ ఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో చోటుచేసుకుంది. ఆ గ్రూపులో దాదాపు అందరూ మహిళలే ఉన్నారు. గ్రూపులోని మహిళలు ఆ వీడియో చూసి షాకయ్యారు. వారు తమ విధులకు అవసరమైన సమాచారమని భావించి వెంటనే చూశారు. తీరా నీలి వీడియో కన్పించడంతో నివ్వెరపోయారు. ఇది సామాజిక మాధ్యమాలకు చేరడంతో చర్చనీయాంశమైంది. ఈ వీడియోను ‘వెలుగు’ ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం పోస్టు చేయడం మరింత చర్చకు దారితీసింది.
వీడియో పోస్టు కావడంపై బాలసుబ్రహ్మణ్యం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాత్రి అత్యవసర సమాచారాన్ని గ్రామ సమాఖ్యలకు పంపుతున్న క్రమంలో తనకు ఎవరో పంపిన వీడియో పొరబాటున సంఘాల గ్రూపునకు చేరిందన్నారు. వారికి తాను నేరుగా క్షమాపణ సైతం చెప్పినట్లు ఆయన తెలిపారు. కావాలని తాను తప్పు చేయకపోయినా కొందరు తనను అపఖ్యాతి చేసేలా ఇతరులకు పంపినట్లు ఆయన వాపోయారు.
ఇది కూడా చదవండి: శ్రీశైలం మల్లన్న సేవలో అమిత్ షా..