అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రులు అధ్వాన్న స్ధితిలో ఉన్నాయి. ఇక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలైతే పూర్తి అనారోగ్య వాతావరణంలో కొట్టు మిట్టాడుతు న్నాయి. సామాన్య ప్రజలకు వైద్య సేవలందించే లక్ష్యంగా ఏర్పా టు చేసిన పిహెచ్సీ, సిహెచ్సీలు నిర్వహణలోపంతో కుంటుపడు తున్నాయి. చాలాచోట్ల ఆయా ఆరోగ ్య కేంద్రాల్లో వైద్య పరికరాలు సైతం పని చేయని దుస్థితి. ఇక కొన్ని చోట్ల అసలే లేని వైనం. పూర్తి అపరిశుభ్రత పరిస్ధితుల నడుమ కరెంటు పోతే కనీసం జనరేటర్ కూడా లేని దుర్గతిలో ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇవి కేవలం ఆరోపణలు కావు. ఆధారాలతో సహా దర్శనమిస్తున్న వాస్తవాలు. ప్రభుత్వ విభాగమైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ కళ్ళకు చిక్కిన నిజాలు. రాష్ట్రంలోని వైద్యసేవలకు సంబంధించి పిహెచ్సీలు, సీహెచ్‌సీలు, పలు ప్రభుత్వాస్పత్రుల్లో ని సౌకర్యాలపై దృష్టి సారించిన విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ శంక భ్రత బాగ్చీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా 39 ఉప కేంద్రాలు, పీహెచ్సీ, సీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేశాయి.
శ్రీకాకుళం, విజయనగరం, ద్వారకా తిరుమల, నెల్లూరు. ఏలూరు తదితర జిల్లాల్లోని కమ్యూ నిటీ హెల్త్ సెంటర్లు లోపభూయిష్టంగా నడుస్తున్నట్లు అధికారు లు గుర్తించారు. రోగులకు సేవలందించేందుకు ఏరకమైన వాహనాలు, అంబులెన్స్‌లు అందుబాటు-లో లేవు. అదేవిధంగా ఆయా చోట్ల వీల్ చైర్, స్ట్రెచర్లు సైతం లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా, అనకాపల్లి జిల్లా, రాజమహేంద్రవరం రూరల్, ప్రకాశం తదితర జిల్లాల్లో విజిలెన్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో ఆయా ఆరోగ్య కేంద్రాలు తీవ్రమైన విద్యుత్ కోతను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. అయితే ప్రత్యామ్నయ ఏర్పాట్లు లేకపోవడం గమనార్హం. అత్యవసర విద్యుత్ సరఫరా కోసం ఇన్వర్టర్లను ఉపయోగిస్తున్నారు. కానీ ఎక్కువసేపు విద్యుత్ కోత ఉన్న సందర్భాల్లో సరిపోదు అందువల్ల జనరేటర్ వినియోగంలోకి తీ సుకురానందున పడుతున్న సమస్యలు బహిర్గతమయ్యాయి.
కాగా చాలా జిల్లాల్లో నిర్వహించబడుతున్న ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల చుట్టూ అపరిశుభ్రత, పరిసరాలు మురికి కూపాలుగా ఉన్నాయి. అనంతపురం, కడప, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం, తిరుపతి అన్నమయ్య జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా తదితర చోట్ల జరిపిన తనిఖీల్లో పారి శుద్ధ్య లోపం, పూర్తి అపరిశుభ్రత, తాగునీటి సమస్యలను అధికారులు గుర్తించారు. ఆయా చోట్ల ఆరోగ్య కేంద్రాల పరిసరాలు, ఆవరణల్లో పందులు స్ధావరాలుగా ఏర్పాటు చేసుకోవడాన్ని గుర్తించిన అధికారులు నోరెల్లబెట్టారు. ఇక ఆయా కేంద్రాలకు వచ్చే రోగులు, వారి తాలూకా బంధువులకు తాగేందుకు కూడా నీరు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.
ఇక మౌళిక సౌకర్యాలు, కనీస సదుపాయల మాట అలా ఉంచితే చాలాచోట్ల ఆరోగ్య కేంద్రాల్లో మందులు, ఇంజక్షన్లు, స్టాక్ రిజిస్టర్లకు సంబంధించి విజిలెన్స్ అధికారులు అవకతవకలను గుర్తించారు. కాకినాడ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ స్టోర్లలో, సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో లభించే మందులకు ఎపిఎంఎస్ఐడిసి జారీ చేసిన సరఫరా బిల్లు బ్యాచ్ నంబర్లతో ఫిజికల్ క్వాంటిటీ- డ్రగ్స్ బ్యాచ్ నంబర్లు సరిపోల లేదు.సెలైన్లు 2022 సంవత్సరంలో ప్రైవేట్‌గా కొనుగోలు చేయబడటాన్ని గుర్తించిన అధికారులు కొనుగోలు రిజిస్టర్ నిర్వహించబడకపోవడాన్ని నిగ్గు తేల్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆపరేషన్ థియేటర్ వినియోగంలో లేదు. విశాఖపట్నం, పల్నాడు, తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం, అనకాపల్లి, చిత్తూరు, కర్నూలు, నంధ్యాల తదితర జిల్లాల్లో కొన్ని చోట్ల స్టాక్ రిజిస్టర్ నిర్వహించకపోవడం, ఇన్ పేషంట్ హాలు దుర్వినియోగం కావడం వంటి వైఫల్యాలు బయటపడ్డాయి. సత్యసాయి జిల్లాలో ఇంజక్షన్లు, టాబ్లెట్లు నిల్వ ఉంచే స్టోర్స్ ఆధునీకరించబడలేదు. పల్నాడు జిల్లాలో స్టాఫ్ నర్సు పోస్టులు ఖాళీగా ఉండగా ఉన్న వారు హాజరుకాకపోవడాన్ని గుర్తించారు. ఈ తనిఖీల కు సంబందించి నివేదిక తదుపరి చర్యల నిమిత్తం విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి పంపనుంది.