Tuesday, October 22, 2024

AP | పాలిటెక్నిక్ తొలి విడత సీటు భర్తీ.. ఆన్‌లైన్, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు 19 వరకు గడువు

అమరావతి, ఆంధ్రప్రభ: పాలిటెక్నిక్‌ అడ్మిషన్ల తొలి విడత కౌన్సిలింగ్‌లో భాగంగా 35,591 మంది విద్యార్దులను వివిధ కళాశాలల కోసం ఎంపిక చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌, అడ్మిషన్ల కన్వీనర్‌ బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రవేశ పరీక్షలో మొత్తం 1,24,430 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, 41,311 మంది విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించారని వివరించారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తర్వాత 38,348 మంది విద్యార్దులు అర్హత సాధించారని, 36,758 మంది విద్యార్ధులు వెబ్‌ ఆప్షన్‌లను ఎంపిక చేసుకున్నారని కన్వీనర్‌ వివరించారు.

విద్యార్ధులు వారి ఎలాట్‌ మెంట్‌ కార్డులను డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ కోసం జూన్‌ 19 వరకు గడువు ఉన్నప్పటికీ, షేడ్యూలు ప్రకారం శుక్రవారమే తరగతులు ప్రారంభించామని విద్యార్ధులు త్వరపడాలని సూచించారు. 88 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లలో కన్వీనర్‌ కోటా సీట్లు 17,915 ఉండగా 68 శాతం మేర 12180 సీట్లు భర్తీ అయ్యాయన్నారు.

172 ప్రవేటు పాలిటెక్నక్‌ లలో 62,313 సీట్లు ఉండగా, 37.5 శాతం మేర 23411 సీట్లు భర్తీ చేసామని కమీషనర్‌ వివరించారు. మొత్తం 260 కళాశాలల్లో 80, 228 సీట్లు ఉండగా 44.36 శాతం సీట్లు తొలివిడతలో భర్తీ అయ్యాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement