Friday, November 22, 2024

పోలింగ్‌ కేంద్రాలు సిద్దం.. భారీ బందోబ‌స్తు ఏర్పాటు యంత్రాంగం..

విజయనగరం, (ప్రభ న్యూస్‌) : జిల్లాలో మంగళవారం జరగనున్న ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ ఎ. సూర్యకుమారి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించకుండా మిగిలిన 7 స్థానాలు, ఖాళీ ఏర్పడిన మరో 4 స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో భోగాపురం మండలం చేపలకంచేరు, నెల్లిమర్ల మండలం సారిపల్లిలో ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి.

బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీటీసీ-1, భోగాపురం మండలం గూడెపువలస, గరివిడి మండలం వెదుళ్లవలస, గుర్ల మండలం నాగళ్లవలస, మెంటాడ మండలం కుంటినవలస, నెల్లిమర్ల మండలం బూరాడపేట, పార్వతీపురం మండలం ఎంఆర్‌నగరం, రామభద్రపురం మండలం బూసాయవలస, మక్కువ మండలం ఏ. వెంకంపేటల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేసారు. ఈ ఎన్నికల నిర్వహణకు 33 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసారు. సుమారు 200 మంది పోలింగ్‌ సిబ్బందిని ఎన్నికల విధుల కోసం నియమించారు.

ఎన్నికల నిర్వహణకు మొత్తం 9 మండలాలకు, తొమ్మిది మంది ఉన్నతాధికారులను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులుగా నియమించారు. వారికి సహకారాన్ని అందించేందుకు మరో 9 మంది ఏఆర్‌ వోలను నియమించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు, వివిధ అంశాలను పర్యవేక్షించేందుకు ఏడుగురు నోడల్‌ అధికారులను కూడా నియమించారు. 9 చోట్ల రిసెప్షన్‌ సెంటర్లు, 9 స్ట్రాంగ్‌ రూములను, 9 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసారు. శాంతిభద్రతల పరిరక్షణకు భారీ సంఖ్యలో పోలీసులను వినియోగిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement