Tuesday, November 26, 2024

కోవిడ్‌ నిబంధనల‌తో స‌హా ఎన్నిక కేంద్రాలు పూర్తిగా సిద్దం..

విశాఖపట్నం, (ప్రభన్యూస్‌): ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాయంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ మల్లికార్జున పేర్కొన్నారు. ప్రశాంతంగా ఈ ఎన్నిలకను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లుగా ఆయన వెళ్లడించారు. భీముని పట్నం మండలం రేఖవానిపాలెం గ్రామ పంచాయితీ పూర్తి పాలక వర్గం అంటే ఒక సర్పంచ్‌, పది వార్డు సభ్యులకూ మరో అయిదు పంచాయితీల్లో సర్పంచ్‌ అభ్యర్ధులకూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడింది. దరిమిలా కె కోటపాడు మండలం అర్ధి, నక్కపల్లి మండలం ఉపమాక సర్పంచ్‌ పదవులకు వివిధ పంచాయితీలలోని 36 వార్డు సభ్యుల పదవులకూ సింగిల్‌ నామినేషన్‌లు మాత్రమే దాఖలైనందున, ఆయా పదవులకు ఎన్నిక ఏకగ్రీవమని ప్రకటించారు.

అలాగే 23 వార్డు సభ్యుల పదవులకు ఏ విధమైన నామినేషన్‌లూ దాఖలు కాలేదు. భీముని పట్నం మండలం రేఖవానిపాలెం సర్పంచ్‌, ఎనిమిది వార్డులకూ, పెదబయలు మండలం గిన్నెల కోట, ముంచింగ్‌పుట్టు మండలం జర్రెల, కొయ్యూరు మండలం బాలారం సర్పంచ్‌ పదవులతో పాటూ చీడికా మండలం చీడిపల్లిలో 3వ వార్డు, నర్సీపట్నం మండలం అమలాపురంలో 5వ వార్డు, నాతవరం మండలం పీకె గూడెం ఆరో ఆర్డు మాకవర పాలెం మండలం మాకవరపాలెంలో ఆరో వార్డు నాలుగు సర్పంచులు, 12వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్‌, ఎన్నికల అధికారి డాక్టర్‌ ఎ మల్లికార్జున వెళ్లడించారు. 21 పోలింగ్‌ స్టేషన్‌లలో 14వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

ఈ ఫలితాల ప్రకటన అనంతరం రేఖరవానిపాలెం ఉప సర్పంచ్‌ పదవికి పరోక్ష పద్దతిలో ఎన్నిక జరుపుతారు. ఈ ఎన్నికల నిర్వహణ 8 మండాలల్లో 8 గ్రామ పంచాయితీలలో 8 మంది ఆర్వోల పర్యవేక్షణలో 25 మంది పీవోలు 52 మంది పీవోలతో జరుపుతారు. అన్‌న పంచాయితీలను సమస్యాత్మక ప్రాంతాలుగా పరిగణించి వీడియోగ్రఫీ జరుపుతారు. ఇప్పటికే మొత్తం ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ లెక్కింపు మెటీరియల్‌తో పోలింగ్‌ఒ కేంద్రాలకు చేరుకున్నారు. పెదబయలు మండలం, గిన్నెల కోట గ్రామ పంచాయితీ పోలింగ స్టేషన్‌ల భద్రతా కారణాల వల్ల కొరవంగి గ్రామంలో ఏర్పాటు చేశారు.

ఎన్నికలు జరిపే గ్రామ పంచాయితీల పరిధిలో 14వ తేదీన స్థానికంగా సెలవు ప్రకటించారు. పోలింగ్‌కు 44 గంటల ముందుగా ఆయా పంచాయితీల్లోని అన్ని మద్యపాన దుఖాణాలనూ మూసివేస్తున్నట్లుగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ మల్లికార్జున ప్రకటించారు. పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఈ సందర్భంగా మల్లికార్జున ప్రకటించారు. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement