Tuesday, November 26, 2024

ముగిసిన పురపాలిక ఎన్నికలు.. 70.66 శాతం పోలింగ్

ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరగ్గా.. నామినేషన్‌ల సమయంలో 4 మున్సిపాలిటీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవం అయిన మున్సిపాలిటీల జాబితాలో మాచర్ల, పుంగనూరు, పిడుగురాళ్ల, పులివెందుల ఉన్నాయి. కాగా బుధవారం నాడు 71 మున్సిపాలిటీలలో 1,633 వార్డులకు.. 12 కార్పొరేషన్‌లలో 581 డివిజన్‌లకు పోలింగ్ జరిగింది. ఈనెల 14న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

సాయంత్రం 5 గంటలకు జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతాలు:
శ్రీకాకుళం-71.52%
విజయనగరం-74.61%
విశాఖ-74.63%
తూ.గో.-75.93%
ప.గో.-71.54%
కృష్ణా-75.90%
గుంటూరు-69.19%
ప్రకాశం-75.46%
నెల్లూరు-71.06%
చిత్తూరు-69.60%
అనంతపురం-69.77%
కడప-71.67%
కర్నూలు-65.23%

12 కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ శాతాలు:
విజయనగరం నగరపాలకసంస్థ – 63.98 శాతం
విశాఖ జీవీఎంసీ –  56.01 శాతం
ఏలూరు నగరపాలకసంస్థ – 56.33 శాతం
మచిలీపట్నం నగరపాలకసంస్థ- 71.14 శాతం
విజయవాడ నగరపాలకసంస్థ – 56.81 శాతం
గుంటూరు నగరపాలకసంస్థ – 57.15 శాతం
ఒంగోలు నగరపాలకసంస్థ – 75.52 శాతం
అనంతపురం నగరపాలకసంస్థ – 56.41 శాతం
కర్నూలు నగరపాలకసంస్థ –  49.26 శాతం
కడప నగరపాలకసంస్థ – 54.85 శాతం
చిత్తూరు నగరపాలకసంస్థ –  66.06 శాతం
తిరుపతి నగరపాలకసంస్థ –  53.44 శాతం

Advertisement

తాజా వార్తలు

Advertisement