అనంతపురం , (ప్రభ న్యూస్) : జిల్లాలో చిలమత్తూరు జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నేడు జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవనుంది. జిల్లాలో 16 ఎంపిటిసి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఇందులో మడకశిర మండలం గోవిందాపురం, డి.హిరేహాల్ మండలం మురడి, గోరంట్ల మండలం కోనాపురం, గోరంట్ల 3, వానవోలు 2, కనగానపల్లి మండలం కోనాపురం, ముదిగుబ్బ మండలం మల్లేపల్లి 1, నార్పల మండలం బి.పప్పూరు, పరిగి మండలం శాసన కోట, పెద్దపప్పూరు మండలం జూటూరు, పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం, పెనుకొండ మండలం రాంపురం, డి.హిరేహాల్ మండలం చెర్లోపల్లి, శింగనమల మండలం వెస్ట్ నరసాపురం, పామిడి మండలం గజరాంపల్లి, చిలమత్తూరు మండలం కొడికొండ ఎంపిటిసిలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో టిడిపి, వైసిపికి సంబంధించిన నాయకులు బరిలో ఉన్నారు. ఇరు పార్టీల నాయకులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఎంపిపి పదవులపై ఈ ఎన్నికలు ప్రభావం చూపకపోయినప్పటికీ.. వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్థానిక నాయకులు భారీగా డబ్బు కూడా ఖర్చు పెట్టారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ముందుగానే మార్చ్ ఫాస్ట్ చేశారు. ఎక్కడా చిన్న సంఘటన జరగకూడదని జిల్లా ఎస్పీ పటిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో పోలీసులు, సిబ్బంది ఏమి చేయాలో ఏమి చేయకూడదో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily