అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ రాజకీయ మంతా ధర్మవరం వైపు మళ్లింది. ఎర్రగుట్ట అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ సాగుతోంది. తొలుత ఈ అంశాన్ని జనసేన అధి నేత పవన్ కల్యాన్ వెలుగులోకి తీసుకొస్తే ఇప్పు డు టీడీపీ యువనేత లోకేష్ మరికొన్ని ఆధారా లను విడుదలచేసి అధికార పక్షంపై విరుచుకుప డుతున్నారు. దీనికి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రతి సవాళ్లు విసురుతూ వస్తు న్నారు. అయినా, టీడీపీ ఎక్కడా వెనక్కి తగ్గకుం డా బుధవారం కూడా కొన్ని ఆధారాలను స్థానికం గా విడుదల చేసింది. దీంతో ఈరచ్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్త చర్చనీయాంశంగా మారింది.
నాయకులందరి చూపు ఎర్ర గుట్టవైపే
ధర్మవరం… పట్టు-చీరలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది… ఇక్కడికి ఎవరొచ్చినా పట్టు-చీరలు చూసేందుకే వస్తారు.. కానీ ఇప్పుడు ఏ నాయకుడొచ్చినా.. అంతా ఎర్రగుట్ట వైపు చూస్తున్నారు. ఇంతకీ ధర్మవరంలో ఎర్రగుట్ట ఎక్కుడుంది అంటే. ధర్మవరానికే ఒక అందమైన చెరువు. జిల్లాలో రెండవ అతి పెద్ద చెరువు అది. ఒక నదిలా కనిపించి చెరువుకు అనుకుని ఒక కొండ ఉంది. అది ఎర్ర మట్టితో ఉంటు-ంది. అందుకే దానిని ఎర్రగుట్ట అంటారు. ఆ గుట్ట దిగువ భాగంలో చెరువుకు ఆనుకుని ఒక గెస్ట్ హౌస్ నిర్మించారు. ఈ గెస్ట్ హౌస్ ఎవరిది అంటే.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిది. అందుకే ఇది అంత వివాదంగా మారింది. ఆయన అక్కడ చెరువులో బోటింగ్ చేసేందుకు బోట్లు-, గుర్రాలు, కాస్ట్లీగా ఉండే ఏటీ-వీ వాహనాలు సమకుర్చుకున్నారు.
ఒక ఎమ్మెల్యేకి ఇంత రాజభోగమా.. ఏంటిది.. ఇదే ప్రతి పక్షాల ప్రశ్న. దానినే లోకేష్ వేలెత్తి చూపిస్తున్నారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు. ఇటు- బీజేపీ నేతలు కూడా ఈ గుట్ట గురించే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు అందరి టార్గెట్ కేతిరెడ్డే అయ్యారు. ఆయన నిర్మించుకున్న ఎర్రగుట్ట ఫాంహౌస్ రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నదని.. అందులో చెరువు భూమిని కూడా ఆక్రమించుకుని తన సామ్రాజ్యా న్ని విస్తరించుకున్నారనేది ఆరోపణ. దీనిపై మొదటి నుంచి లోకల్‌గా ఉన్న నేతలు ఆరోపణ లు చేస్తూనే ఉన్నారు. అయితే దానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి సమాధానం ఇస్తూనే ఉన్నారు. దీనిపై కొన్ని రోజుల క్రితం జనసేన నేత పవన్ కళ్యాణ్ కొన్ని ఫోటోలు చూపిస్తే కామెంట్ చేయడం.. రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. అప్పుడు
కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఘాటు-గానే సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ఆ చెరువు మీదుగానే వచ్చారు. ఆ సమయంలో డ్రోన్ వీడియోలు తీసి.. ఇదిగో కేతిరెడ్డి అక్రమాలంటూ వేలు పెట్టి చూపించారు. దీంతో ఇది రాష్ట్రంలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అప్పటి వరకు అక్కడ నిర్మించుకున్న భవనం ఎవరూ చూడలేదు. కానీ ఇప్పుడు అందరూ చూసి ఇంత అందమైన ప్లేస్ లో రాజభోగాలతో భవనం ఏంటి అని ఆశ్చర్య పోయారు. కేతిరెడ్డి భూ ఆక్రమణల గురించి లోకేష్ చాలా విమర్శలు కూడా చేశారు…
లోకేష్, కేతిరెడ్డి సవాళ్లు
లోకేష్ ధర్మవరం వచ్చి సవాల్ విసిరి వెళ్తే.. కేతిరెడ్డి ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసం ఉండే కరకట్ట వద్దకు వెళ్లి ఛాలెంజ్ చేశారు. ఆ ఆరో పణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కేతిరెడ్డి అమరావతిలోని చంద్ర బాబు నివాసానికి వెళ్లి ప్రతి సవాల్ విసిరారు. దీంతో నారా లోకేష్ పాటు- పరిటాల శ్రీరామ్ ఆధా రాలను బయటపెట్టారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా తీసిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ఎర్రగుట్టపై ఉన్న భూముల్ని రైతుల నుంచి కొన్నానని కేతిరెడ్డి అంటు-న్నారని.,, రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం ఎమ్మెల్యే తమ్ముడి భార్య పేరుతో కొను గోలు చేసింది 25.38 ఎకరాలు మాత్రమేనని ఆరోపిస్తూ కొన్ని పత్రాలను విడుదలచేశారు. అయితే, గుట్టపై మొత్తం 45 ఎకరాల భూమి ఎమ్మెల్యే ఆక్రమణలో ఉందని….మిగిలిన 20 ఎక రాలు కబ్జాచేశారని స్పష్టంగా అర్థమౌతోందం టూ.. ఆరోపణలు చేశారు.
కానీ కేతిరెడ్డి మాత్రం వీరు చేస్తున్న ప్రతి ఆరోపణకు సమాధానం ఇచ్చారు. తాను కట్టు-కున్నది 25.38ఎకరాల్లోనె నని అది లోకేష్‌కు, లేదా పవన్ కళ్యాణ్‌కు వచ్చి చూపించాల్సిన అవసరం లేదన్నారు. అది తన దేనని చెబుతున్నా కదా అంటు-న్నారు. కానీ ఆక్ర మించారన్న దానికి సాక్ష్యం చూపండి అని కేతిరెడ్డి అన్నారు. తన భవనం చుట్టూ భూమి ఉంటి తాను ఆక్రమించుకున్నట్టా.. రికార్డుల్లో ఎంత భూమి ఉందో అది తనద ని అంటు-న్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎర్రగట్ట రాజకోట రహస్యంలా మారిపోయింది. టీ-డీపీ, బీజేపీ, జనసేన ఇలా ప్రతిపక్షాలన్నీ ముప్పేట దాడి చేస్తు న్నా.. కేతిరెడ్డి మాత్రం ఏ విచారణ అయినా చేసు కోవచ్చని.. నేను చేసిందంతా లీగల్ అంటూ కేతి రెడ్డి చెబుతున్నారు. లోకేష్ మాత్రం ముదిగుబ్బ మండలంలోబినామీలద్వారా30ఎకరాల వరకూ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని, జాతీయ రహ దారికి సమీపంలోని గంజేపల్లి గ్రామంలో పేదల కు ఇచ్చిన ఇళ్ల పట్టాలను కబ్జా చేసి లాక్కున్నారని ఆరపించారు. ఈ భూముల విలువ దాదాపు రూ. 8 కోట్లు ఉంటుందని , మొత్తం ముదిగుబ్బలో ఆక్రమించిన భూమల విలువ రూ. 60 కోట్ల పై మాటేనని లోకేష్ ఆరోపణలు చేస్తూ ఆప్రాంతా నికి సంబంధించిన చిత్రాలన మీడియాకు విడుద లచేశారు.దీంతోఈవివాదంమరింత ముదిరింది.