మాజీ మంత్రి, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాసేపట్లో మార్కాపురంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈబీసీ నిధులను ఆయన విడుదల చేయనున్నారు. దీనిలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా ముఖ్యనేతలు మార్కాపురం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ వద్దకు మంత్రులు, ఇతర నేతలు బయల్దేరారు. ఈ క్రమంలో బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కనపెట్టి నడిచి రావాలని ఆయనకు సూచించారు. దీంతో పోలీసులపై బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా అక్కడి నుంచి ఆయన వెనుదిరిగారు. నచ్చజెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేశ్, జిల్లా ఎస్పీ, ఇతర నేతలు యత్నించినా బాలినేని అక్కడ ఉండకుండా ఒంగోలు వెళ్లిపోయారు. తన సభకు బాలినేని హాజరుకాకపోవడంపై సీఎం జగన్ ఆరా తీశారు.
బాలినేనిని అడ్డుకున్న పోలీసులు.. జగన్ సభకు డుమ్మా..
Advertisement
తాజా వార్తలు
Advertisement