Wednesday, November 20, 2024

ఉమాదేవి ఆత్మహత్య కేసులో ట్విస్ట్

వసాయ శాఖ ఉద్యోగి ఉమాదేవి ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో అధికారులు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ మల్లికార్జున రావు, కానిస్టేబుల్ మణీలను వీర్‌కు పంపించారు. ఇప్పటికే సీఐ, కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. అదనపు ఎస్పీ మనోహర్‌తో  విచారణకు ఆదేశించారు. సీఐ రత్నస్వామిని నగరం పాలెం స్టేషన్‌కు ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించారు.

గుంటూరులోని అంకమ్మనగర్‌లోని భూసార పరీక్ష కేంద్ర కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఉద్యోగిని చికినం ఉమాదేవి శనివారం (మే 22) ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కోడలితో ఆస్తి విషయమై వివాదం నేపథ్యంలో ఉమాదేవిని పోలీసులు విచారణ పేరుతో వేధించారని ఆమె కుటుంబసభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నగరంపాలెం సీఐ మల్లికార్జునరావు, కానిస్టేబుల్‌ మణి వేధింపుల వల్లే ఉమాదేవి బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. స్టేషన్‌కు పిలిచి వేధించారని, బలవంతంగా ఆస్తి రాయించేందుకు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉమాదేవి కారును తీసుకుని వాడుకున్నారని, పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మ విచారణకు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement