తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : తిరుపతి సిటీలోని ఇర్లానగర్ లో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. 70 లక్షల రూపాయలు విలువ కలిగిన బంగారు, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పనాయుడు తెలిపారు. గురువారం ఎస్ పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ చోరీ వివరాలు వెల్లడించారు. ఇటీవల జరిగిన రెండు ఇంటి దొంగతనం కేసులో నేరస్తుడిని అరెస్ట్ చేసి అతని నుంచి 16 10 గ్రాముల బంగారు ఆభరణాలు 3 కేజీలు వెండి వస్తువులు దేవుడి విగ్రహాలు, నగదు 50,000 మొత్తం 70 లక్షల రూపాయలు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇర్లా నగర్లోని బళ్లాపురం రాజేష్.. సునీత, నాగరాజు ఇళ్లళ్లో ఎలక్ట్రికల్ పనిచేస్తూ నమ్మకం గా ఉంటున్నాడు. వాళ్లు ఇంట్లో లేని సమయంలో ఇంటిపై భాగం నుంచి లోపలికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డాడు. ఇతనే వారికి అనుమానం రాకుండా పెద్ద ఎత్తున వస్తువులు పోయినాయని తెలిస్తే ఇన్‌కమ్ టాక్స్ అధికారులు వస్తారని, దొంగతనం విషయం బయటికి తెలియకుండా వారిని భయభ్రాంతులకు గురిచేశాడు.
గత ఏడాది ఆగస్టు 17వ తేదీన. ఈనెల 13వ తేదీన రెండు దొంగతనాలకు సంబంధించి నిందితుడి నుంచి రికవరీ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఐటిఐ చదివి ఎలక్ట్రికల్ పని చేస్తూ జీవనం సాగించే రాజేశ్.. ఆర్థిక పరిస్థితి బాగా లేని కారణంగా దొంగతనం చేసిన సొత్తును అమ్ముకుని జిమ్ ఏర్పాటు చేయాలని భావించినట్టు పోలీసుల విచారణలో తేలింది. కాగా, ఈ దొంగతనానికి సంబంధించి తిరుపతి అర్బన్ జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్ క్రైమ్ ఇంచార్జి సుప్రజ. వెస్ట్ డిఎస్పి నరసప్ప. క్రైమ్ డిఎస్పి సుధాకర్. వెస్ట్ సిఐ శివప్రసాద్ టీమ్‌కు ఎస్పీ అభినందనలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..