Friday, November 22, 2024

కొండపల్లికి టీడీపీ నిజనిర్ధరణ కమిటీ.. నేతల హౌస్ అరెస్టు

కృష్ణాజిల్లా  కొండపల్లిలో జరిగిన అక్రమ మైనింగ్ పరిశీలనకు సిద్ధమైన తెలుగుదేశం పార్టీ నిజ నిర్థారణ కమిటీని పోలీసులు అడ్డుకుంటున్నారు. నిజనిర్ధారణ కోసం వేసిన కమిటీ సభ్యులను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై కమటీ క్షేత్రస్థాయి పర్యటన చేయనుంది. దీంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. నిన్నటి నుంచి కమిటీ సభ్యులను గృహనిర్బంధం చేశారు.

మొత్తం 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు టీడీపీ అధినేత చ్రందబాబు ఏర్పాటు చేశారు. 10 మంది సభ్యుల కమిటీలో 8 మంది గృహనిర్బంధం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, విజయవాడలో నాగుల్‌ మీరా, వర్ల రామయ్య, బొండా ఉమ, మచిలీపట్నంలో మాజీ ఎంపీ కొనకళ్ల, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జగ్గయ్యపేటలో నెట్టెం రఘురామ్, నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపల్లి ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమాపై పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.

ఇది కూడా చదవండిః దళిత బంధు ఆగే ప్రసక్తే లేదు: సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement