Tuesday, November 26, 2024

ఉమెన్ డ్రాప్ ఎట్ హోం.. యువతిని రక్షించిన పోలీసులు

ఆత్మహత్య చేసుకునేందుకు ఇంటి నుండి బయటకు వచ్చిన ఓ 22 ఏళ్ళ యువతిని ఉమెన్ డ్రాప్ ఎట్ హోం వాహన పోలీసు సిబ్బంది రక్షించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో 22 ఏళ్ళ వయస్సు గల యువతి ప్రేమ వ్యవహారం వల్ల కలత చెంది తాను ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకుంది. సర్పవరం నుంచి కాకినాడ RTC కాంప్లెక్స్‌ కు వచ్చింది. అయితే, ఆత్మహత్యకు భయపడి మనసు మార్చుకుని, తిరిగి ఇంటికి వెళ్ళడానికి పోలీస్ డయల్ 100 కు కాల్ చేసి సహాయం కోరింది. కంట్రోల్ రూమ్ సిబ్బంది సమాచారం మేరకు నైట్ సూపర్ చెకింగ్ ఆఫీసర్ అయిన 3వ టౌన్ ఇన్స్పెక్టర్ తక్షణమే స్పందించి ఉమెన్ డ్రాప్ ఎట్ హోం వాహనంలో RTC బస్ కాంప్లెక్స్‌కు చేరుకొని యువతితో మాట్లాడారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి భద్రత కల్పించారు. అనంతరం యువతిని ఆమె కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement