హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏపీ టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియతోపాటు ఆమె భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై అభియోగాలు నమోదు చేశారు. ఐటీ అధికారుల పేరుతో కిడ్నాప్ చేసిన కేసులో వ్యాపారవేత్త కిడ్నాప్‌నకు ప్లాన్ చేసిన సుపారి గ్యాంగ్‌పై కూడా అభియోగాలు నమోదు చేశారు. మొత్తం 16 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. కాగా, ఈ కేసులో భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేయగా సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె బెయిల్ పై బయటకొచ్చారు.
గతేడాది జనవరి 5న 15 మంది వ్యక్తులు ఆదాయపు పన్ను (IT) ఉద్యోగులుగా నటించి, బోయిన్‌పల్లిలోని నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, సునీల్ కుమార్‌లను కిడ్నాప్ చేసి, వారిని కోకాపేట్ వద్ద వదిలిపెట్టారు. భూ వివాదం కారణంగా ఈ కిడ్నాప్ ప్లాన్ జరిగింది.