Friday, November 22, 2024

AP | మాతృభూమి కోసం పనిచేసే నిస్వార్థ శ్రామికులు పోలీసులు… అచ్చెన్నాయుడు

(ఆంధ్రప్రభ బ్యూరో) శ్రీకాకుళం, అక్టోబర్ 21: ప్రజల కోసం పోరాడుతూ అమరవీరులైన వారిని స్మరించుకోవడం మన అందరి బాధ్యతని, మాతృభూమి శ్రేయస్సు కోసం పనిచేసిన నిస్వార్థ శ్రామికులు పోలీసులని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. వి.మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాప్ అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈకార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్, జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, ఎస్సీ కె.వి.మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు గొండు శంకర్, ఎన్ ఈశ్వర రావులతో కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు సిబ్బంది నిర్వహించిన స్మృతి పరేడ్ ద్వారా అమర వీరులకు నివాళులర్పించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి కింజరాప్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…. ఈ రోజు జరుపుకుంటున్న పోలీసు అమరవీరుల దినోత్సవం ద్వారా మనం చాలా తెలుసుకోవాల్సింది ఉంద‌న్నారు. దేశం కోసం లడక్ లో తమ ప్రాణాలర్పించిన, ఆశువులు బాసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ పోలీసుల అమరవీరుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఈరోజు జరుపుకుంటున్నామ‌న్నారు. దేశం అభివృద్ధి చేద్దాలంటే పోలీస్ ల‌ పాత్ర చాలా కీలకమన్నారు. విధినిర్వహణలో చాలా కష్ఠాలు ఉన్నాయన్నారు. దేశంలో పోలీసు వ్యవస్థ ఒకటైతే మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై గర్వపడుతున్నానన్నారు. నక్షలిజాన్ని అదుపు చేసి శాంతిభద్రతలు కాపాడుకోవడంలో మంచి పాత్ర పోశించారన్నారు. రాష్ట్రలో గంజాయి, మదకద్రవ్యాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్రాన్నిమాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. అందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రహదారి ప్రమాదాలను టెక్నాలజీని ఉపయోగించి ఆరికట్టాలన్నారు. విజయవాడలో వచ్చిన వరదల్లో పోలీసులు అందించిన సేవలను కొనియాడారు.

కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ… ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పోలీసుల‌ సేవలు అభినందనీయమన్నారు. దేశ చరిత్రలో పోలీసు సంస్మరణ దినం విశిష్ట దినంగా భావిస్తున్నామన్నారు. ఆపద సమయంలో వెనకడుగు వేయకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వారు ఒక్క సైనికులు పోలీసులే అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజలకోసం ప్రాణలర్పించిన వారికి నివాళులర్పించారు.

ఎస్పీ కె.వి.మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… తాము విధి నిర్వహణే పరమావధిగా భావిస్తామన్నారు. 1958 అక్టోబర్ 21న భారత (లడాక్) చైనా సరిహద్దుల్లో దేశంకోసం తమ ప్రాణాలర్పించిన ఆశువులు బాసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ పోలీసు అమరవీరుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఈ రోజు జరుపుకోవడం జరుగుతుందన్నారు. దేశావ్యాప్తంగా 216 మంది అమరులయ్యారని, అందులో మన రాష్ట్రానికి చెందిన వారు ఇద్దరున్నారన్నారు. విధి నిర్వహణలో పోలీసులు కుటుంబాలకు దూరంగా ఉంటారన్నారు. ప్రభుత్వం పోలీసులకు అనేక సౌకర్యలు కల్పిస్తున్నారన్నారు.

కారుణ్య నియామకాలు ఈ సంవత్సరం ఐదుగురికి ఉద్యోగం ఇవ్వడం జరిగిందన్నారు. మన జిల్లాలో విధినిర్వహణలో అమరులైన ఐదుగురు పోలీసులు ఎస్.బంగారు నాయుడు, ఎ.పాపారావు, ఎం.నరేంద్ర దాస్, ఎం.వెంకటరమణ, పి కృష్ణమూర్తి ప్రత్యర్థుల దాడుల్లో అమరులై ప్రాణాలర్పించారని తెలిపారు. వారి సేవలు గుర్తు చేసుకోవడం మన భాధ్యతని, వారికి ఘనంగా నివాళులర్పించి వారి త్యాగాలకు గుర్తుగా వారి కుటుంబాలకు జ్ఞాపకాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డీఎస్పీలు వివేకానంద, రాజశేఖర్, శేషాద్రి, ప్రసాద్, అమరవీరుల కుటుంబ సభ్యులు, సీఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement