Thursday, November 21, 2024

వచ్చే ఏడాది జూన్‌ నాటికి పోలవరం పూర్తి..

అమరావతి, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని, ఈ ప్రాజెక్టును 2023 జూన్‌ నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం ఉందని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలిలో సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు, రామ్మోహన్‌ తదితరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ స్పిల్‌వేను పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి 48 గేట్లల్లో 42 రేడియంల్‌ గేట్ల నిర్మాణాన్ని పూర్తిచేశామని, అలాగే 10 రివర్‌ స్లూయిస్‌ గేట్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు.

ఇప్పటికే 75 శాతం అప్రోచ్‌ ఛానల్‌ పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు. 2300 మీటర్ల మేర కాఫర్‌ డ్యాం పనులు పూర్తి చేశామని, దిగువ కాఫర్‌ డ్యాం పనులు 1637 మీటర్ల మేర పూర్తి అయ్యాయని చెప్పారు. స్పిల్‌ వే ఛానల్‌ ద్వారా వరద నీటి మళ్లింపుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేశామని తెలిపారు. 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి మధ్యలో ఈ పనులు పూర్తి అయినట్లు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement