పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం అవిష్కృమైంది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు పూర్తి అయ్యాయి. 2020 డిసెంబర్ 17న గేట్ల అమరిక పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. గత సీజన్‌లో వరదలు వచ్చే నాటికి 42 గేట్లను అమర్చి, వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మిగిలిన 6 గేట్ల అమరిక పనులు సైతం పూర్తి చేశారు. ఇప్పటికే రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకుగానూ 84 సిలిండర్లను అమర్చారు. త్వరలోనే మిగిలిన 6 గేట్లకు 12 సిలిండర్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు.
కాగా, పోలవరం ప్రాజెక్టును 2023 నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్వాసిత కుటుంబాల పునరావాసంలో చురుకైన పురోగతి ఉంది. 2022 ఆగస్టు నాటికి అవుకు రెండవ దశను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.