పోక్సో కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేదుకు నిరాకరణ
విచారణ ఎదుర్కొవలసిందేనని ఆదేశం ..
తదుపరి విచారణ 24కి వాయిదా ..
అమరావతి: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన పోక్సో చట్టం కేసు కొట్టివేయాలని వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో పిటిషనర్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. క్వాష్ పిటిషన్‌లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను ఎదుర్కొవలసిందేనని తేల్చ చెప్పింది హైకోర్టు..