Monday, January 6, 2025

PM Schedule – ఎపిలో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న ఖ‌రారు

నాలుగో తేదిన విశాఖ‌కు రాక‌
నేవీ వేడుక‌ల‌లో చీఫ్ గెస్ట్ గా హాజ‌రు
ఎనిమిదో తేదిన విశాఖ జ‌ల్లాలో ప‌ర్య‌ట‌న
స్టీల్ ప్లాంట్ తో స‌హా వివిధ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు
మోదీతో పాటు పాల్గొన‌నున్న చంద్ర‌బాబు,ప‌వ‌న్ క‌ల్యాణ్

న్యూ ఢిల్లీ – ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల‌లో ఆయ‌న రెండు సార్లు ఎపికి రానున్నారు.. విశాఖ‌లో జ‌రిగే నేవీ వేడుక‌ల‌లో పాల్గొనేందుకు ఈ నెల నాలుగున రానున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మోదీతో పాటు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన‌నున్నారు..

విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాప‌న‌లు
ఇక ఈ నెల 8న ప్రధాని మ‌ళ్లీ విశాఖ రానున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో అనేక కార్యక్రమాలతో పాటుగా బహిరంగ సభలోనూ ప్రధాని పాల్గొంటున్నారు . 8వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఆయన నగరంలో ఉంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.

- Advertisement -

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఎన్‌టీపీసీ నిర్మించనున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంటు, న‌క్క‌ప‌ల్లి స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ నిర్మాణాల‌కు శంకుస్థాపన చేయ‌నున్నారు. అలాగే రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలను సభా వేదిక నుంచి చేపడతారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమాల్లో సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ సైతం పాల్గొంటారు. బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, పవన్ మాట్లాడిన తరువాత ప్రధాని కీలక ప్రసంగం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement