Monday, November 18, 2024

AP: ఐఐఎం వైజాగ్‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించ‌నున్న మోదీ

ఇవాళ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖపట్నం శాశ్వత క్యాంపస్‌ను ప్ర‌ధాని మోదీ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించ‌నున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఇతర అధికారులు కూడా వర్చువల్‌ గానే పాల్గొంటారు.

కాగా, భవనాల నిర్మాణానికి అవసరమైన 472.61 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా.. గత టీడీపీ ప్రభుత్వం ఆనందపురం మండలంలోని గంభీరంలో 436 ఎకరాల భూమిని కేటాయించింది. శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి 2015 జనవరి 17న అప్పటి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భూమి పూజ చేయగా.. ఈ పనులు పూర్తికావడంతో ప్రధాని మోడీ దీన్ని నేడు ప్రారంభించనున్నారు. శాశ్వత క్యాంప్‌సను 62,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. దీంట్లో ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌, క్రికెట్‌ మైదానం, ఇండోర్‌, అవుట్‌డోర్‌ గేమ్స్‌కు అనుగుణమైన సదుపాయాలు, జిమ్‌, యోగా, మెడిటేషన్‌ సెంటర్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే, 1500 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్యానల్స్‌ సైతం ఏర్పాటు చేశారు. కాగా, గత తొమ్మిదేళ్ల నుంచి ఆంధ్ర వర్సిటీలోని (ఏయూ) తాత్కాలిక క్యాంప్‌సలో ఐఐఎం తరగతులను కొనసాగిస్తున్నారు. తొలి బ్యాచ్‌ 2015లో స్టార్ట్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement