Tuesday, November 26, 2024

PM Gati Shakti: ‘పీఎం గతిశక్తి’పై సదస్సు.. రాష్ట్రాల సలహాలు స్వీకరించనున్న కేంద్రం

కేంద్ర రవాణా, రహదారుల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఇవాళ “పీఎం గతిశక్తి వర్చువల్ సదస్సు” జరిగింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీ.కే సింగ్, కేంద్ర రవాణ, రహదారుల శాఖ  కార్యదర్శి గిరిధర్ ఆరమనే, అదనపు కార్యదర్శి అమిత్ కుమార్ గోష్, కేంద్ర సరకు రవాణా ప్రత్యేక కార్యదర్శి అమృత్ లాల్ మీనా, అండమాన్ నికోబర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, లక్ష్యద్వీప్, మహారాష్ట్ర, పొదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.  ఈ సమావేశంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాజరైయ్యారు.

ఈ సందర్భంగా “గతిశక్తి”ని అమలుపరచడంలో సంబంధిత శాఖల మంత్రులు, పారిశ్రామికవేత్తల ద్వారా పానెల్ ల వారీ చర్చించారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతులను మరింత అభివృద్ది చేసే దిశగా పీఎం గతిశక్తిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గత నెల వెస్ట్ జోన్ సమావేశాన్ని నిర్వహించిన కేంద్రం.. ఇవాళ దక్షిణాది రాష్ట్రాల సమక్షంలో నిర్వహించిన సదస్సు ద్వారా సలహాలు స్వీకరించనుంది. సదస్సులో ముందుగా పీఎం గతిశక్తికి సంబంధించిన వీడియో ప్రదర్శించారు. రాష్ట్రాలు, కేంద్రం కలిసి ముందుకు సాగాలని కేంద్ర రవాణా, రహదారుల శాఖ స్వాగతం పలికింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement