Friday, December 27, 2024

Srisailam : మా లేఖ‌ల‌కూ ద‌ర్శ‌న‌ భాగ్యం క‌లిగించండి.. టీటీడీకి మంత్రి కొండా విన‌తి

నంద్యాల బ్యూరో, డిసెంబర్ 27 : తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే లేఖలను తిరుమలలో అనుమతించాలని తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్థం తెలంగాణ మంత్రి రాత్రి ఆలయానికి చేరుకున్నారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆమెకు స్వాగతం పలికారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. రెండు రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అనంత‌రం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారని, వారి కోరిక మేరకు తిరుమల దేవస్థానంలో భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.


- Advertisement -

తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలను తిరుమలలో అనుమతించాలని డిమాండ్ చేశారు. భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం త‌మ విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానన్నారు. టీడీటీ తరఫున తెలంగాణలో ధర్మ ప్రచారానికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను ఈ ప్రభుత్వం అనుసరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement