Tuesday, November 12, 2024

AP : ద‌యచేసి మీరు మారండి… వైఎస్ విమల

షర్మిల, సునీత దయచేసి మీరు మారండి అంటూ వైఎస్సార్ చెల్లెలు వైఎస్ విమల ఫైర్ అయ్యారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ హంతకుడి మాటలు విని ఆరోపణలు చేస్తారా? తప్పుడు ఆరోపణలతో జీవితాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహించారు.

- Advertisement -

మా ఇంట్లో అమ్మాయి ఇలా మాట్లాడడం బాధగా ఉంది… ఏ తప్పు చేయని నా సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాదికాలంగా జైలులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా కుటుంబాన్ని అల్లరిపెట్టడం ఎంతవరకు సమంజసం… మేనత్తగా చెబుతున్న మీరు ఇప్పటికైనా మారండని కోరారు. జగన్ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి… సంక్షేమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. షర్మిల, సునీత దయచేసి మీరు మారండి… మీరు చేసింది కరెక్ట్ అని అనుకోవద్దని కోరారు. మీరు ఏం మాట్లాడినా కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారు…అవినాశ్ రెడ్డి ప్రజల కోసం పనిచేసే మనిషి అన్నారు వైయస్ఆర్ సోదరి వైఎస్ విమల.

Advertisement

తాజా వార్తలు

Advertisement