Wednesday, November 20, 2024

ప్లాటినం రేటింగ్ ను పొందిన విజయవాడ రైల్వే స్టేషన్‌…

(కేదారేశ్వర పేట,ప్రభ న్యూస్) విజయవాడ రైల్వే స్టేషన్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐ.జీ.బీ.సీ) ద్వారా గ్రీన్ రైల్వే స్టేషన్‌గా అత్యున్నత “ప్లాటినం రేటింగ్” సర్టిఫికేషన్‌ను పొందింది. ఈ రేటింగ్ ద్వారా గ్రీన్ రైల్వే స్టేషన్‌లకు సంబందించిన అత్యున్నత రేటింగ్‌ విజయవాడ రైల్వే స్టేషన్‌కు లభించినట్లయింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఐ.జీ.బీ.సీ నుండి గోల్డ్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇప్పుడు ప్లాటినం సర్టిఫికేషన్ యొక్క అత్యున్నత ప్రమాణాన్ని సాధించింది .
ఐ.జీ.బీ.సీ, ఇండియన్ రైల్వేస్ క్క పర్యావరణ డైరెక్టరేట్ (ఎన్విరాన్‌మెంట్ డైరెక్టరేట్ ) తో కలిసి గ్రీన్ పద్దతులను అవలంభిoచడానికి గ్రీన్ రైల్వే స్టేషన్ల రేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. వీటి ద్వారా స్టేషన్ ఆపరేషన్ & నిర్వహణ కారణంగా ఉత్పన్నమైనటువంటి ప్రతికూల పర్యావరణ ప్రభావాలను తగ్గిచ్చడేమే కాకుండా మొత్తం ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, ఇంధన సామర్థ్యం, శిలాజ ఇంధనాల వినియోగం తగ్గడం, కొత్త వస్తువులపై తక్కువ ఆధారపడటం, నివాసితుల ఆరోగ్యం & శ్రేయస్సు వంటి జాతీయ ప్రాధాన్యతలను పరిష్కరించడానికి రేటింగ్ సిస్టమ్ సహాయపడుతుంది.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ విజయవాడ స్టేషన్కు ఐజిబిసి నుండి అత్యధిక గ్రీన్ సర్టిఫికేట్ సాధించినందుకు విజయవాడ డివిజన్ అధికారులను అభినందించారు. హరితహారం కోసం స్టేషన్లో తీసుకుంటున్న చర్యలను తెలుసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ తరహా సర్టిఫికేషన్లు ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తాయని, మరింత ముందుకు సాగేందుకు దోహదం చేస్తాయని ఆయన తెలియజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement