తిరుమల ప్రభన్యూస్ : ప్రపంచ ప్ర ఖ్యాత క్షేత్రమైన తిరుమల కొండ పై బుధవారం నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని టిటిడి పూర్తిగా నిషేదించింది. మూడేళ్ళ క్రితం నుంచి దశల వారిగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేదిస్తూ వస్తున్న టిటిడి బుధవారం నుంచి ఈ నిబంధనను పూర్తి స్తాయిలో అమలులోకి తెచ్చింది. తిరుమల కొండ పై నివశిస్తున్న స్థానికులు, దుకాణ దారులు కూడా కచ్చితంగా ఈ నిబంధనను పాటించాలని ఆదేశాలు జారి చేసిన అధికారులు నిబంధనలను ఉల్లంఘించిన వారి దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని దశలవారిగా నిషేదించాలని నిర్ణయించిన టిటిడి 2019 నవంబర్ 1 వ తేది నుంచి తిరుమలలో పూర్తి స్థాయిలో కవర్ల వాడకాన్ని నిషేధించింది.
భక్తులే కాక శ్రీవారి ఆలయంలో ప్లాస్టిక్ కవర్ల వి నియోగాన్ని పూర్తిగా నిలిపివేసింది. అటు ఆలయ అర్చకులతో పాటు ఇటు అధికారులు, సిబ్బంది శ్రీవారి ఆలయంలో ప్లాస్టిక్‌ను వినియోగించకుండా ఆదేశాలు జారి చేసి పూర్తి స్థాయిలో ఈ నిబంధనను అమలులోకి తెచ్చింది. మరో వైపు లడ్డుల కోసం టిటిడి విక్రయిస్తున్న ల డ్డూ కవర్ల విక్రయాన్ని కూడా నిషేధించిన టీటీడీ కవర్లకు ప్రత్యామ్నాయంగా అట్ట పెట్టెలతో పాటు గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు, దులసి దళంతో చేసిన కవర్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. ఇలా మూడేళ్ళ క్రితం నుంచే ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని టిటిడి పూర్తిగా నిషేధించింది.