Friday, January 10, 2025

Pitapuram – స్కామ్ ల‌లో గ‌త ప్ర‌భుత్వం స‌రికొత్త రికార్డ్ … ప‌వ‌న్ కల్యాణ్

వాటిని స‌రి దిద్దే ప‌నిలో కూట‌మి ప్ర‌భుత్వం
తిరుప‌తి ఘ‌ట‌న‌పై మ‌రోసారి సారీ
త‌ప్పు ఎవ‌రు చేసినా శిక్ష పడాల్సిందే
అంద‌రూ బాధ్య‌త‌లు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాలి
పిఠాపురంలో గోకులం స‌భ‌లో ప‌వ‌న్ కల్యాణ్

పిఠాపురం: గత ప్రభుత్వం స్కామ్ ల్లో రికార్డు సృష్టించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్ర‌స్తుతం వాటిని సరిదిద్దే ప‌నిలో ఉన్నామ‌ని చెప్పారు. పిఠాపురం మండలం కుమారపురంలో కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను ఇక్కడి నుంచి నేడు లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివా కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంత‌రం
పిఠాపురం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ప‌వ‌న్ ప్ర‌సంగిస్తూ, శ్రమ ఉన్న చోటే పెట్టుబడులు వస్తాయ‌ని చెప్పారు.. రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా ఆలోచనలు చేస్తున్నామ‌న్నారు.. దీనిలో బాగంగానే ప‌శు సంప‌ద‌ను పెంచే ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు.. ప‌శు పోష‌ణ‌తో రైతులు ఆర్దికంగా స్థిర‌ప‌డ‌తార‌న్నారు..

- Advertisement -

తిరుమ‌ల‌లో ఘ‌ట‌న .. మ‌రోసారి సారీ
తిరుప‌తి ఘ‌ట‌న‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి సారీ చెప్పారు. తప్పు జరిగితే అది మా అందరి సమష్టి బాధ్యతగా తీసుకోవాల‌ని కోరారు. అందుకే తిరుపతి ఘటనపై మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాన‌న్నారు.. టోకేన్ల జారీ వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న డిఎస్పీ సక్రమంగా బాధ్యతలు నిర్వహించకపోవడంతోనే తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు బదిలీ అయ్యారన్నారు..కింద స్థాయి అధికారి తప్పుకు పై స్థాయి అధికారిపై వేటు పడిందన్నారు.. ఎస్పీ సుబ్బరాయుడు బదిలీ తనను బాధించిందని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్..

ఇదే సమయంలో తిరుమల తొక్కిసలాట ఘటన పై టీటీడీ ఛైర్మన్, సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని సూచించారు. తానే క్షమాపణ చెప్పినప్పుడు… మీకు చెప్పడానికి నామోషీ ఏమిటని ప్రశ్నించారు. తాను మాత్రమే దోషిగా నిలబడాలా? అని ప్రశ్నించారు. వీఐపీ ట్రీట్మెంట్ తగ్గించాలని… కామన్ మేన్ ట్రీట్మెంట్ పెంచాలని చెప్పారు.

ఇక ఉద్యోగి, అధికారి.. ఎవరైనా వారి బాధ్యతలు సరిగా నిర్వర్తించాల‌ని సూచించారు. . గత ప్రభుత్వంలో అలవాటుపడి కొందరు పనిచేయడం మానేశార‌ని ఆక్షేపించారు. న్యాయం అందరికీ జరిగేలా చూడటం ముఖ్యమ‌ని అంటూ తప్పు చేస్తే త‌న‌ను కూడా శిక్షించాలని కోరారు డిప్యూటీ సిఎం.

Advertisement

తాజా వార్తలు

Advertisement