కర్నూలు నగరపాలక సంస్థకు చెందిన రూ.కోటి విలువ చేసే మంచినీటి పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలోని సుందరయ్య పార్క్ లో మంటలు చెలరేగాయి. ఈ పార్కులో కర్నూల్ కార్పొరేషన్ అధికారులు మంచినీటి పైపుల వినియోగం కోసం భారీగా పైపులను డంపు చేశారు. అయితే ఆకతాయిలు ఎవరో నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. వీటివల్ల కోటి రూపాయల విలువ చేసే పైపులు కాలిపోయాయి. రెండు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేశాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement