టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఏపీలో అఖండ విజయం సాధించిన చంద్రబాబుకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని రేవంత్ ఆకాంక్షించారు. విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి కోరారు.
కాగా, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 135, జనసేన 21, వైఎస్సార్సీపీ 11, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయి మెజార్టీ సాధించింది టీడీపీ. ఈ నేపథ్యంలో 12వ తేదీన చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Phone Call – విభజన సమస్యలు పరిష్కరించుకుందాం – చంద్రబాబుతో రేవంత్
Advertisement
తాజా వార్తలు
Advertisement