అమరావతి, ఆంధ్రప్రభ: ఫార్మసీ కళాశాలల అనుమతి పొడిగింపునకు ప్రభుత్వం అంగీకరించినందున రాష్ట్రంలోని బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల అడ్మిషన్ షెడ్యూల్‌ను అతిత్వరలో విడుదల చేయనున్నామని, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
ఎంపీసీ అభ్యర్థులకు తొలుత 5 రోజులు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తామని, ఎంపీసీ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరిగిన వెంటనే బైపీసీ విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. బీఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలతో సిద్దంగా ఉండాలని కన్వీనర్ వివరించారు. షేడ్యూలు విడుదల అయిన తరువాత ప్రక్రియ వేగంగా ముగుస్తుందని తెలిపారు.