ఏపీ హైకోర్టులో చింతామణి నాటకం రద్దుపై పిటిషన్ దాఖలైంది. ఆంధ్రప్రదేశ్ లో చింతామణి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్షయంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు కళాకారులు, నాటకాన్ని నమ్ముకుని జీవిస్తున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో ఆర్టిస్ట్ అరుగు త్రినాథ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో ఆర్టిస్టులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతామణి నాటక ప్రదర్శనను నిలిపివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 7ని సవాల్ చేస్తూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అత్యవసర పిటిషన్‌గా స్వీకరించాలని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..