Monday, November 18, 2024

రుయా ఆస్పత్రిపై కేసు నమోదు చేయలేదు: హైకోర్టులో పిటిషన్

తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పీఆర్ మోహన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ ను న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. రుయా ఆస్పత్రిపై కేసు నమోదు చేయలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఘటనకు ఆసుపత్రి తప్పిదమని స్వయానా కలెక్టర్ చెప్పినా.. ఇంతవరకు ఆస్పత్రిపై FIR నమోదు చేయలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది యలమంజల బాలాజీ తెలిపారు. ఆక్సిజన్ అందక రుయా ఆసుపత్రిలో చనిపోయిన కోవిడ్ బాధితులకు విశాఖ గ్యాస్ లీకేజ్ మృతులకు ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారం అందించిన విధంగానే.. రుయా ఆసుపత్రి మృతులకు కోటిరూపాయల నష్టపరిహారం అందించాలని కోరారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలన్నారు. ఈ ఘటనలో 36 మంది చనిపోతే ప్రభుత్వం 11 మందేనని చెబుతోందని…న్యాయ విచారణకు ఆదేశించాలని వాదనలు వినిపించారు. కేంద్రం ఇచ్చిన ఐదు ప్లాంట్లను నేటి వరకు నెలకొల్పలేదన్నారు. వాదనలు విన్న కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుపతి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం కోర్టు ప్రారంభమైన తొలిరోజుకి విచారణ వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement