Wednesday, November 20, 2024

పట్టుతప్పుతున్న పెద్దపులుల భద్రత.. పెద్దపులుల మృతి వెనుకాల కారణాలేంటి..?

ఆత్మకూరు, (ప్రభన్యూస్‌) : దేశంలోనే పెద్దపులులకు అభయారణ్యం నల్లమల అటవీ ప్రాంతం. అడవిలో వన్యమృగాలు క్రూరమృగాలు వన్యప్రాణాలు పక్షి జాతులు విష సర్పాలు మరి ఎన్నో వింత విశేషాలు ఉన్నాయి. అయితే నల్లమల అడవిని ఎన్నికోట్ల నిధులతో అభివృద్ధి చేశారన్న విషయం ఇప్పటికీ ప్రశ్నార్ధకమే. మరోవైపు అటవీశాఖ అధికారులు బదిలీలు లేక ఏడు సంవత్సరాల నుంచి ఒకే డివిజన్‌లో పాతుకుపోయారు. మరోవైపు అసలు పెద్దపులుల సంరక్షణ చేయాల్సిన అటవీ శాఖ అధికారులు అవినీతి ఆరోపణులు ఎదుర్కొంటున్నారు. ఈ శాఖపై ప్రభుత్వం పర్యవేక్షణ కరువైంది. బదిలీలు చేయకపోవడం కారణాలు ఏమిటో తెలియడం లేదు. రాష్ట్రంలో ప్రతి శాఖలో బదిలీలు జరిగినప్పటికీ అటవీశాఖలో ఎందుకు జరగడంలేదో..
ఆత్మకూర్‌ వన్యప్రాణి విభాగం పాలన పరిధిలో దాదాపు నల్లమల్ల అటవీ ప్రాంతం 3000 హెక్టార్లలో విస్తరించిందని అటవీశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి.

శ్రీశైలం, నాగలూటి, వెలుగోడు, బైర్లుటి,ఆత్మకూర్‌ ఈ రేంజ్‌ లో పరిధిలో అటవీ క్షేత్ర స్థాయి అధికారులు పరిపాలన చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెద్దపులి జీవవైవిధ్యానికి ముందుగా ఉండేది నల్లమల్ల అడవులే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న‌ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జరిగింది. అయితే అటవీ శాఖలో మాత్రం బదిలీల ఊసు లేదు. ఏడు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పటికీ అటవీ క్షేత్రస్థాయి అధికారులు బదిలీలు లేకపోవడంతో నల్లమల్ల అటవీ ప్రాంతంలోని పెద్దపులుల అభయారణ్యం అయినా ఆత్మకూరు అటవీ డివిజన్‌ లో పెద్ద పులుల సంరక్షణ గాలిలో దీపం చెప్పవచ్చు.

వారం రోజుల క్రితం బైర్లూటి రేం జి పరిధిలో పెద్ద నంతపురం సెక్షన్‌లో పెద్దపులి మృతి చెంది నెలరోజులపాటు అయినా అధికారులు పసికట్టలేక పోయారు. ప్రతి రోజు అటవీశాఖలో విధులకు హాజరయ్యే ముందు ఉద్యోగులు కిందిస్థాయి సిబ్బంది ముందుస్తుగానే అటవీశాఖ అధికారులు నిర్దేశించిన యాప్‌ ద్వారా విధుల్లో ఉన్నామని సమాచారం ఎప్పటికప్పుడు అటవీ శాఖ ఉన్నతాధికారులకు తమ దగ్గర ఉన్న సెల్ఫోన్ల ద్వారా సమాచారాన్ని చెరవేయాల్సిఉంది. అటవీశాఖలో ప్రతి బీటు సెక్షన్లు కంపార్టుమెంట్లు ఏర్పాటు చేసి జియో టాకింగ్‌ ద్వారా అటవీశాఖ ఉన్నతాధికారులు వి ధి నిర్వహణలో ఉన్న అటవీశాఖ సిబ్బంది సమాచారాన్ని పంపాల్సి ఉంది.

అడవీ అభివృద్ధికి ఎన్ని కోట్ల నిధులు ఖర్చు చేశారు..

ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడవిని అభివృద్ధి చేసేందుకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఇందుకు సంబంధించి లెక్కలు ఉండవు.. ఆడిట్‌ అధికారులకు తేలని లెక్కలు కాగితాలకే పరిమితం అయ్యాయని అటవీ శాఖ గణాంకాలు తెలుపు ఉన్నాయి. అడవిలో వన్యప్రాణులు దాహం తీర్చేందుకు ఏటా లక్షల రూపాయల ని ధులు ఖర్చు చేస్తారు. వీటికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించినప్పటికీ ఆ లెక్కలు మాత్రం బయటకు రానివ్వరు. అటవీ ఫైర్‌ అభివృద్ధి పనులు, కనిపించని ఎన్నోపనులు చేపట్టినట్లు చూపిస్తారు వన్యప్రాణులు దాహార్తిని తీర్చేందుకు చెక్‌ డ్యాంల మరమ్మతులు, మినీ ట్యాంక్‌లు ఎన్నో పనులను చేపడుతూనే ఉంటారు. ప్రతి రేంజ్‌లో అటవీ శాఖ అధికారులకు తప్పనిసరిగా పర్సెంటేజీ ఇవ్వాల్సిందే లేకపోతే ఫైలు ముందు వెళ్లదు.. ఇలా శాఖలో అవి నీతి ఆరోపణులు ఎదుర్కొంటున్న అటవీ క్షేత్ర స్థాయి అధికారులపై సస్సెన్షన్‌ వేటు పడేనా అని విమర్శలకు దారి తీస్తోంది.

- Advertisement -

అవినీతి అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడేనా..?

ఆత్మకూరు అటవీ డివిజిన్లలో విధి నిర్వహణలో ఉన్న కొంతమంది అటవీ క్షేత్రస్థాయి అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే అభివృద్ధి పనులు లేక మామూళ్లకు అలవాటు పడ్డ అధికారుల అని సందేహాలు ప్రజల్లో నీటికి వెంటాడుతూనే ఉన్నాయి ప్రతి రేంజ్‌స్టాయి అధికారులు చేస్తున్న అవినీతి పైన అటవీశాఖ లో ఉన్న విజిలెన్స్‌ అధికాలురు మాత్రమే వీరి బాగోతాన్ని ముందుకు రావడం జరుగుతుంది పరిపాలన విభాగంలో పని చేసి అటవీశాఖ అధికారులు తప్పు చేస్తే ఆ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా అటవీ క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చే మామూళ్లతో జేబులు నింపుకుంటున్నారని. విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. అటవీశాఖలో గాడితప్పిన పాలన కొనసాగుతోందని ప్రజల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement