అమరావతి – జనసేనాని పవన్ కల్యాన్ మచిలీపట్నం సభపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, పవన్ చెప్పినవన్నీ తియ్య తియ్యని అబద్దాలు అంటూ వ్యాఖ్యానించారు..దుర్యోధనుడు, ధృతరాష్ట్రుళ్లు ను పక్కనే ఉంచుకుని తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని మండిపడ్డారు.. ఓ నాయకుడు పార్టీ పెట్టి మూసేశాడంటూ సొంత అన్ననే పవన్ హేళన చేశారని గుర్తు చేశారు… రాజకీయాల్లో వచ్చి పదేళ్ళు అవుతుందని పవన్ అన్న మాటలకు కౌంటర్ ఇస్తూ, 2009లో యువరాజ్యం అధ్యక్షుడు కాదా? అది రాజకీయం కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పెట్టిన తన అన్న చిరంజీవినీ పరోక్షంగా ఎత్తిపొడుస్తున్నాడని మండిపడ్డారు.
డబ్బులు లేవు అంటూనే రోజుకు రెండు కోట్లు నా సంపాదన అని తనే అన్నారని ఎద్దేవా చేశారు. . బందర్ లో బీసీ డిక్లరేషన్ అని బీసీలకు మాటిచ్చారని, 48 గంటలు కూడా అవ్వక ముందే బీసీ డిక్లరేషన్ మాట మర్చిపోయారని సెటైర్లు వేశారు. నోరు తెరుస్తే కులం పేరుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కు సంకల్పం, చిత్తశుద్ధి, నాయకత్వం ఉంటే తన లాంటి వాళ్లు ఆయన వెనుకే ఉండేవారమని, జగన్ వెంట ఎందుకు వెళ్తామంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సభ అర్థరాత్రి మద్దెల దరువు అంటూ వ్యాఖ్యానించారు. పవన్ దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆపాలన్నారు. ముసుగులు వేసుకుని కాకుండా చెట్టాపట్టాలేసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రండి అంటూ సవాల్ చేశారు. వచ్చే ఎన్నికలలో ఒంటరిగా వచ్చినా , కలసి వచ్చినా చిత్తుగా ఓడిస్తామని పవన్, చంద్రబాబులను హెచ్చరించారు నాని..