Tuesday, November 26, 2024

Counter – ఎవరు కదలి రావాలి? చంద్రబాబుకు పేర్ని నాని ప్రశ్న

మచిలీపట్నం – చంద్రబాబు రా కదలి రా అని సభ పెట్టారని.. ఎవరు కదలి రావాలి? ఎందుకు రావాలని ఆయన ప్రశ్నించారు. పగవాడికి కూడా చంద్రబాబుకి పట్టిన దుర్గతి పట్టదన్నారు. కనిగిరిలో హైదరాబాద్, బెంగుళూరులో కలిగే అవకాశాలు కల్పిస్తామని అంటున్నారన్నారు. 2014-2019 మధ్య ఎందుకు అవకాశం ఎందుకు కల్పించలేదన్నారు. పవన్, చంద్రబాబుకి పిచ్చి మాటలు చెప్పే అలవాటు ఉందన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో నిత్యావసరాల ధరలు తగ్గించారా అంటూ ప్రశ్నలు గుప్పించారు.

పవన్, చంద్రబాబు 2014లో ఇంటికో ఉద్యోగం అన్నారని.. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబు బీసీలకు ఏం చేశారని.. ఓట్లు వచ్చినప్పుడు జయహో బీసీ అనాలని ఎద్దేవా చేశారు. మైనార్టీల ఓట్లు కావాలి.. కానీ ఐదేళ్లలో మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.

హరికృష్ణ, ఎన్టీఆర్, పురంధేశ్వరి లు బాబు వ్యతిరేకులే

చంద్రబాబుకి హరికృష్ణ, ఎన్టీఆర్ వ్యతిరేకం కాదా అంటూ ప్రశ్నించారు. పురంధేశ్వరి వ్యతిరేకం కాదా?.. చంద్రబాబు సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ లో చేరి పని చేశారా లేదా?.. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు చంద్రబాబు మీద పుస్తకం రాయలేదా? అంటూ ప్రశ్నలు గుప్పించారు.

వైసీపీ జెండా లేకుండా కాపు ఎమ్మెల్యే కాగలరా?

- Advertisement -

కాపు రామచంద్రారెడ్డి వైసీపీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని.. కాపు రామచంద్రారెడ్డి వైసీపీ జెండా లేకుండా ఎమ్మెల్యే కాగలరా అంటూ విమర్శించారు. ఎన్ని డబ్బులు ఉన్నా ఎమ్మెల్యే అవుతారా అంటూ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్

పవన్ చెప్తున్న కాపు పెద్దలు ఎవరని.. మేము ఎవరిని రెచ్చగొట్టామని ఆయన ప్రశ్నించారు. 2014లో కాపులకు రిజ్వేషన్ హామీ ఇచ్చారు కనుక చంద్రబాబు, పవన్‌లను ముద్రగడ అడిగారన్నారు. ఇప్పుడు పోటీకి ఎవరూ లేక వాకిలి తెరిచి ఉందని అంటున్నాడన్నారు. చంద్రబాబు ఇచ్చే 20 సీట్లకు పోటీ చేసే వారే పవన్ దగ్గర లేరన్నారు. అవసరాల కోసం వచ్చిన వాళ్ళే బయటకి వెళ్తారని.. పార్టీపై, ప్రజలపై ప్రేమ ఉన్న వారు పార్టీలో ఉంటారన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement