చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండల కేంద్రంలో విద్యుత్ అధికారులు సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో త్రాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యుత్ లేకపోవడంతో పంచాయితీ నీళ్లు రావడం లేదు. దీంతో స్థానిక ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నామన్నారు. మండల కేంద్రంలో విద్యుత్ అంతరాయం ఏర్పడినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం శోఛనీయం. ఇకనైనా స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని విద్యుత్ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించి త్రాగునీటిని అందించాలని ప్తజలు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily