గుంటూరు జిల్లాలో జరిగిన మేమంతా సిద్దం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయన్నారు. సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తామని బాబు చెప్పారు.. కానీ అభివృద్ది జరిగిందా అని సీఎం జగన్ ప్రశ్నించారు. 2014లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కూటమి ఇంటింటికీ రంగుల మేనిఫెస్టోను పంపిణీ చేసి, ఆ హామీలను తుంగలో తొక్కిందని తీవ్రంగా విమర్శించారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం చేసిందని.. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి.. 99 శాతం హామీలను అమలు చేశామని సీఎం జగన్ అన్నారు. 2 లక్షల 70 వేల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రజలు రెండు సార్లు బటన్స్ నొక్కి వైసీపీని గెలిపించాలని జగన్ కోరారు. 58 నెలలుగా జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించేలా ఆశీర్వదించాలని.. . ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచిన వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు.