Friday, November 22, 2024

స‌చివాల‌యాల‌లో రిజిస్ట్రేష‌న్ లు – ఆస‌క్తి చూప‌ని ప్ర‌జ‌లు

అమరావతి, ఆంధ్రప్రభ: భూక్రయ, విక్రయాలకు సంబం ధించి రిజిస్ట్రేష్రన్లను మరింత సులభతరం చేయడానికి, అవినీతి అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం సచివాల యాల ద్వారా రిజిస్ట్రేష్రన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అంతే గాకుండా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద పడిగాపులు లేకుండా సొంత గ్రామంలోనే రిజిస్ట్రేషన్లు చేయించే అరుదైన అవకాశాన్ని కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 269 సబ్‌ రిజిస్ట్రార్ర్‌ కార్యాలయాలు వున్నాయి. వీటిపై పని వత్తిడి తగ్గించేందుకు గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 35, రెండో విడత 16 సచివాలయాలో ప్రయోగాత్మంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పూర్వపు రెవిన్యూ డివిజన్ల ప్రాతి పడికన 51 రెవెన్యూ ఢివిజన్లలోని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. అయితే ఈ ప్రక్రియ ప్రారంభమైనా ప్రభుత్వం ఆశించినంత మేర రిజిస్ట్రేష్రన్లు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రయోగాత్మకంగా కొన్ని సచివాలయాలను ఎంపిక చేసిన అవసరమైన పరికరాలను అందుబాటు-లో ఉంచారు. సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. కానీ సేవలు వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే భూముల రీసర్వే జరుగుతున్న మండలాల్లో గ్రామ సచివాలయాలల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు సచివాలయాలను ఎంపిక చేశారు. సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు.ఇప్పటికే రెండు విడతలలో మంది సచివాలయ సిబ్బందికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై శిక్షణ పూర్తి చేశారు. రెండో విడతలో మరికొంతమందికి శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో సచివాలయాల ద్వారా. నవంబరు నుంచి ఇప్పటి వరకూ కేవలం వేళ్ళ మీద లెక్కించే విధంగా మాత్రమే రిజిస్ట్రేషన్లు సచివాలయాల్లో జరిగాయి. సబ్‌ రిజస్ట్రారు కార్యాలయాల్లో చూపిన ఆసక్తి గ్రామ సచివాలయాలపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు.

గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన ప్రభుత్వం దానిపై పెద్దగా అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. వాస్తవానికి రిజిస్ట్రేషన్లు గ్రామీణ స్థాయిలో చేయడం వల్ల క్రయ, విక్రయదారులకు వ్యయప్రయాసలు తప్పుతాయి. కానీ ప్రజలు మాత్రం సబ్‌ రిజిస్ట్రార్ర్‌ కార్యాలయాలకే వెళ్లి పనులు చేసుకుంటు-న్నారు. ఇక్కడ దరఖాస్తు చేసుకున్నా అక్కడ నుంచే అనుమతి రావాల్సి ఉండటంతో నేరుగా అక్కడికే వెళ్లి దస్తావేజు లేఖరులు ద్వారా సులువుగా ప్రక్రియను పూర్తి చేసుకుంటు-న్నారు. అక్కడ అనుభవం కలిగిన వారు ఉండటంతో భవిష్యత్‌లో ఇబ్బందులు రావని సబ్‌రిజిస్ట్రార్ర్‌ కార్యాలయాలకే వెళుతున్నారు. దీనిపై అధికారులు ప్రజలకు పూర్తిస్తాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరముంది.
రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే పూర్తయిన మండలాల్లోని గ్రామ, వార్డు, సచివాలయాల్లో క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు అన్ని సౌకర్యాలు కల్పించామని అధికారులు చెబుతున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రాకుండానే నేరుగా రిజిస్ట్రేష్రన్‌ ప్రక్రియ చేసుకోవచ్చనీ,సేవలను వినియోగించుకోవాలనీ సూచిస్తున్నారు. ఏమైనా సందేహాలుంటే సబ్‌రిజిస్ట్రార్ర్‌ కార్యాలయాల్లో ఏర్పాటు- చేసిన హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలనీ చెబుతున్నారు. అయినా జనం మాత్రం రిజిస్ట్రేష్రన్ల కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పట్ల చూపిన ఆసక్తి గ్రామ సచివాలయాల పట్ల చూపడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement