- రెండవ రోజు ప్రజా దర్బార్ ను నిర్వహించిన వైఎస్ జగన్
- జనాలతో కిటకిటలాడుతున్న క్యాంపు కార్యాలయం
పులివెందుల, అక్టోబర్ 30 (ఆంధ్రప్రభ) : పులివెందులలో రెండో రోజు క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి వారి సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు.
కొంత మంది సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరింపజేసేందుకు కృషి చేస్తామని చెప్పినట్లు వారు తెలిపారు. మరికొందరు పలు సమస్యలను ఆయనకు అర్జీల రూపంలో విన్నతులను అందజేశారు. ఈ అర్జీలను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని చెప్పినట్లు ప్రజలు తెలిపారు. జగన్ ను కలిసేందుకు నాయకులు బారులుదీరి వేచి ఉన్నారు.
- Advertisement -