దెందులూరు : రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి యువతకు భవిష్యత్తు ఇవ్వటం చేతకాని జగన్ రెడ్డి, తన సభల ఆర్భాటాల కోసం నేడు ఇంటర్ విద్యార్థుల జీవితాలతో సైతం అడుకుంటున్నారని, త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి ఒక్క యువత సహా, వారి కుటుంబ సభ్యులు మొత్తం జగన్‌కి బుద్ది చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
దెందులూరు మండలం సోమవరప్పాడులో ఇవ్వాల (శుక్రవారం) జరిగిన బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీ పధకాల విశిష్టతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. “జగన్ తన సభలకు ‘సిద్ధం’ అని పేరు పెట్టారని, దాని అర్ధం ప్రజలను మళ్ళీ తన అబద్ధాలతో మోసం చేయడానికి, ప్రజలపై కరెంట్ చార్జీలు పెంచి బాదటానికి, రాష్ట్ర వనరులను, ప్రభుత్వ ఆస్తులను దోచుకోవటానికి తాను మళ్ళీ సిద్ధం అని, కల్తీ మద్యం సరఫరా చేసి రాష్ట్రంలో మరింత మంది మరణాలకు కారణం అయ్యి, వాళ్ళ కుటుంబాలు నాశనం అయ్యి రోడ్డున పడేలా చేయటానికి తానూ సిద్ధంగా ఉన్నాను అని వాటిని భరించటానికి ప్రజలు కూడా సిద్ధమా అని అడగటానికే ఈ సిద్ధం అనే సభలు పెడుతున్నారని చింతమనేని తెలిపారు.
దెందులూరులో జరిపే సిద్ధం సభ కోసం ప్రజలను బలవంతంగా తరలిస్తున్నారని, రాకపోతే ఫించన్లు, ఆసరా రావని భయపెట్టి వారిని తీసుకువచ్చి ఆర్భాటాలు పోతున్నారని, జగన్ దెందులూరు సభకు జనాల్ని తరలించటానికి శనివారం జరగాల్సి ఉన్న ఇంటర్ ప్రధమ సంవత్సరం పర్యావరణ విద్య పరీక్షను సైతం 23వ తేదీకి వాయిదా వేశారని, ఈ మార్పు వల్ల ఆ పరీక్షను రాయాల్సిన 5లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది అని చింతమనేని తెలిపారు. ఇటువంటి వ్యక్తికి బుద్ది చెప్పటానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని భారీ విజయంతో గెలిపించి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించటానికి ప్రజలంతా సంసిద్దంగా ఉన్నారని చింతమనేని తెలిపారు..
ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి మిల్లు బాబు, క్లస్టర్ ఇంచార్జ్ యలమర్తి శ్రీను, గ్రామ పార్టీ అధ్యక్షుడు కర్రీ రంగారావు, మాజీ MPTC అల్లు జ్యోతి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాగంటి సురేంద్రనాధ్ చౌదరి, గ్రామ తెలుగుదేశం యువ నాయకులు మాగంటి గిరిధర్, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, నియోజకవర్గ ఎన్నికల కోర్డినెటర్ ఇప్పిలి వెంకటేస్వరావ్ (Y.V.R), బిసి నాయకులు సిమే సురేష్, సూరిబాబు, బూత్ ఇంచార్జ్ కచ్చా పెద్దిరాజు ఉప్పే రంగారావు, కొడాలి బాబీ సహా పలువురు టిడిపి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..