Saturday, November 30, 2024

Pensions Day – నేమకల్లు లో పించన్ లు పంపిణీ చేసిన చంద్రబాబు

అనంతపురం, : ఏపీ వ్యాప్తంగా ఒకరోజు ముందుగా పెన్షన్ల పంపిణీ వేగంగా కొనసాగుతున్నది.. రేపు ఆదివారం కావడంతో ఒకోరోజు ముందే అంటే ఈరోజు ఉదయం నుంచే అన్ని ప్రాంతాల్లో లబ్దిదారులకు పెన్షన్లను గ్రామ పంచాయితీ సిబ్బంది స్థానిక నేతలు పంపిణీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా లబ్దిదారులకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేశారు. విజయవాడ నుంచి నేటి మధ్యాహ్నం అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామానికి చేరుకున్న సీఎం.. ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారురాలి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్‌‌ను స్వయంగా అందజేశారు. ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారురాలు పాల్తూరు రుద్రమ్మ ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద నాలుగు వేల రూపాయల వితంతు పెన్షన్‌ను సీఎం అందజేశారు. అనంతరం నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. ఆపై వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం ..


కాగా.. బొమ్మనహాల్ మండలం నేమకల్లు చేరుకున్న సీఎం చంద్రబాబునాయుడు మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్, పల్లె సింధూర రెడ్డి, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణి శ్రీ, గుమ్మనూరు జయరాం, ఎమ్మెస్ రాజు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సీఎం పంపిణీ చేశారు. అనంతరం నేమకల్లు ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement