అమరావతి, ఆంధ్రప్రభ : అమరావతిలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన గ్రామ వాలంటీర్లుగా పని చేస్తున్న వారి కుటుంబాలకు సామాజిక పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఇకపై ప్రతి నెలా భూమి లేని నిరుపేద కుటు-ంబాలకు పింఛను రూ.2,500 ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఇటీవల అమరావతి గ్రామాలలో పర్యటనలో ఉన్న సమయంలో భూమి లేని నిరుపేద కుటు-ంబాలకు చెందిన వాలంటీర్లు ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన శ్రీలక్ష్మి ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డికి సమస్యను వివరించగా సానుకూలంగా స్పందించారు. వారి కుటుంబాలకు పెన్షన్లు అందించాలని ఆదేశించారు. అమరావతిలో భూమి లేని సుమారు 200 మంది గ్రామ వాలంటీ-ర్ల కుటు-ంబాలకు వ చ్చేనెల ఒకటో తేదీ నుంచి నెలకు రూ. 2500 చొప్పున పెన్షన్ అందించనున్నట్లు శ్రీలక్ష్మి వెల్లడించారు.