Friday, November 22, 2024

Good News: త్వరలో పెన్నా, సంగం బ్యారేజీలు ప్రారంభం: మంత్రులు వెల్లడి

పెన్నా, సంగం బ్యారేజీలను త్వరలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పెన్నా బ్యారేజీ పనులను మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్థన్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇ‍చ్చారు. ఈ సంద్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. వరద కష్టాల నివారణకు కుడా ఈ బ్యారేజీలు దోహద పడతాయన్నారు.

పెన్నా, సంగం బ్యారేజీ పనులు 90 శాతం పైనే పూర్తయ్యాయని మరో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. సీఎంగా వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయని చెప్పారు. నెల్లూరు జిల్లా రైతుల కలను సీఎం జగన్‌ సాకారం చేయబోతున్నారని పేర్కొన్నారు. గత టీడీపీ హయాంలో పనులు నత్తనడకన సాగాయని.. చంద్రబాబు అసలు పట్టించుకోలేదని మంత్రి కాకాణి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement