అమరావతి: పెగాసస్ స్పైవేర్ వ్యవహారం ఏపీ అసెంబ్లీలో గందరగోళం సృష్టించింది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు హౌస్‌కమిటీ వేస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఇవ్వాల ప్రకటించారు. పెగాసెస్ అంశాన్ని పూర్తిగా తేల్చేందుకు విచారణకు ఆదేశిస్తున్నామని.. హౌస్ కమిటీ విచారణ చేపడుతుందని తెలిపారు. దీనికీ సంబంధించి కమిటీ సభ్యులను రేపు (మంగళవారం) కానీ, ఎల్లుండి (బుధవారం)కానీ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం (చంద్రబాబు హయాంలో) అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం రూ.25 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై హౌస్ కమిటీ వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని అసెంబ్లీలో ప్రకటించారు.