Sunday, November 24, 2024

ప్రెస్ మీట్ లు పెట్టుకోండి…ఎన్నిక‌ల క‌మిష‌న్ పై మాట్లాడ‌వ‌ద్దు…పెద్దిరెడ్డికి హైకోర్టు ఆదేశం..

అమరావతి: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరోసారి హైకోర్టులో ఊరట లభించింది. మీడియాతో మాట్లాడవద్దన్న సింగిల్‌ జడ్జి ఆదేశాలపై పెద్దిరెడ్డి డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ చేశారు. ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు అనుమతిచ్చింది. ఎన్నికల ప్రక్రియపై మాట్లాడకూడదని, ఎస్‌ఈసీ, కమిషనర్‌ లక్ష్యంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అంత‌కు ముందు పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని, మీడియాతో మాట్లాడకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఇటీవల డీజీపీని ఆదేశించారు. ఎస్‌ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలన్న ఆదేశాలను రద్దు చేసింది. మీడియాతో మాట్లాడకుండా చూడాలన్న ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. దీనిపై పెద్దిరెడ్డి అప్పీల్ కు వెళ్ల‌గా, ప్రెస్ మీట్ ల‌కు అనుమ‌తిచ్చింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement