Monday, July 1, 2024

AP : భద్రత పెంచాలని… హైకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి (రాజంపేట ఎంపీ) తమకు భద్రత పెంచాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ‌ విచారణ చేపట్టింది. నిబంధనల ప్రకారం పెద్దిరెడ్డికి 1 ప్లస్ 1 భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలుపగా… ఎవరికి ఎంత భద్రత ఇవ్వాలనేది సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయిస్తుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం… కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement