గంపలగూడెం: కృష్ణా జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణం,కళ్యాణమండపం కొత్త శోభను సంతరించుకున్నాయి. రాత్రి 10 గంటలకు శ్రీమాన్ పరాశరం వెంకట రమణాచార్యులు పర్యవేక్షణలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు తిరునఘరి గోపాలాచార్యులు ఆధ్వర్యంలో రుత్విక బృందం సకలజన నయనానందకరముగా స్వామి వారి కల్యాణం జరగనుంది. పీటలపై 250 మంది జంటలు కూర్చోనున్నట్లు ఆలయ ఈవో నూతక్కి వెంకట సాంబశివరావు,ఆలయ చైర్మన్ కావూరి శశిరేఖ తెలిపారు. కల్యాణోత్సవానికి వచ్చే అశేష భక్త జనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వివిధశాఖల అధికారులు, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ 250 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేయనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement