మచిలీపట్నం ప్రైవేట్ గోదాం నుంచి రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ విచారణకు నేడు పోలీస్ ల ఎదుట హాజరయ్యారు.. బెయిల్ మంజూరు సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయమూర్తి సూచించిన ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పోలీసులు పేర్ని నాని సతీమణికి నోటీస్ లు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లారు. అయితే పేర్ని నాని కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఇంట్లో లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వచ్చేశారు. ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో బుధవారం హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఆమె నేటి మధ్యాహ్నం తన న్యాయవాదితో కలసి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అనంతరం పోలీసులు రేషన్ బియ్యం మాయంపై ఆమె నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement